గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా..సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కరతాళధ్వనులతో అభినందించారు. మహాత్మాగాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సాధ్యం చేసేందుకు గతేడాది ఇదే రోజున ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ విజయవంతమైనట్లు సీఎం స్పష్టం చేశారు.
అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇంటికి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందిస్తున్నట్లు సీఎం వివరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలందిస్తోన్న గ్రామ సచివాలయ వ్యవస్థను సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి జగన్ చప్పట్లతో వారిని అభినందించారు.
గ్రామస్వరాజ్యం తీసుకువచ్చేందుకే...
గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తీసుకువచ్చేందుకు సచివాలయ వ్యవస్థ ఎంతో తోడ్పడుతోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా... విశాఖలో మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్ చంద్, ఇతర ఉన్నతాధికారులు చప్పట్లతో ప్రశంసించారు.
పారదర్శక పాలన కోసం...
ప్రభుత్వ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందించడంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాత్ర కీలకమని హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరులో అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందిస్తున్న సేవలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు వద్దకు తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ సచివాలయ సిబ్బందిని ఘనంగా సత్కరించారు.
వారి సేవలు వెలకట్టలేనివి...