'అనుభవజ్ఞులైన అధికారులను చూశాకే నమ్మకం కలిగింది' - dinner
సివిల్ సర్వీస్ అధికారులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి సతీసమేతంగా ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. అధికారుల సాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు.
ముఖ్యమంత్రి దంపతులు
By
Published : Jun 25, 2019, 5:48 AM IST
'అనుభవజ్ఞులైన అధికారులను చూశాకే నమ్మకం కలిగింది'
రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో సహకరించేందుకు మంచి అనుభవం కలిగిన ఉన్నతాధికారుల బృందం లభించిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అనుభవజ్ఞులైన అధికారుల మార్గదర్శకత్వంలో ఏపీని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామన్న నమ్మకం కలిగిందని వ్యాఖ్యానించారు. విజయవాడ బెరం పార్కులో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. తన మదిలోని ఆలోచనలను నిన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అందరితో పంచుకున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారుల ప్రేమను, అభిమానాన్ని చూరగొనడం చాలా సంతోషకరమైన విషయమని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా ఐఏఎస్, ఐపీఎస్, ఐపీఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మన్మోహన్ సింగ్... ముఖ్యమంత్రికి జ్ఞాపికను అందజేసి, శాలువాతో సత్కరించారు.