ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TICKET RATES: ఇకపై ప్రభుత్వ నిర్ణయం మేరకే.. సినిమా హాళ్లలో ధరల పెంపు

ఆంధ్రప్రదేశ్ సినిమా నియంత్రణ చట్టం - 1955 ప్రకారం జారీ చేసిన జీవోను ప్రభుత్వం సవరించింది. దీంతో.. ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సినిమా హాళ్లలో వివిధ కేటగిరీల ధరలను ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే పెంచవలసి ఉంటుందని హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

TICKET RATES
ఇకపై ప్రభుత్వ నిర్ణయం మేరకే

By

Published : Jul 6, 2021, 8:39 PM IST

Updated : Jul 7, 2021, 5:11 PM IST

కాలానుగుణంగా జారీ చేసే ఉత్తర్వుల మేరకే సినిమా హాళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరలను (TICKET RATES) సవరించేందుకు వీలుంటుందని ప్రభుత్వం పేర్కోంది. ఈ మేరకు టికెట్ ధరలకు సంబంధించిన సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సినిమా నియంత్రణ చట్టం - 1955 ప్రకారం జారీ చేసిన జీవో నెం: 1273 ను సవరిస్తూ హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

గతంలో సినిమాహాళ్లలోని వివిధ కేటగిరీల కింద టికెట్ ధరలను గరిష్ఠంగా పెంచుకునే వెసులుబాటును సవరిస్తూ.. కొత్తగా ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమాహాళ్లలో టికెట్ల రేట్లను మార్చవలసి ఉంటుందని హోంశాఖ స్పష్టం చేసింది.

Last Updated : Jul 7, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details