ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం నిర్వాకంతోనే రైతుల ఆత్మహత్యలు'

రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల పట్ల తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారిని ప్రభుత్వం సకాలంలో ఆదుకోకపోవటం వల్లే అన్నదాతల బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

chinarajjappa-coments-on-farmers
తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప

By

Published : Nov 16, 2020, 12:23 PM IST


ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... వాటిని కుటుంబ కలహాల వల్ల చనిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన వారిని ప్రభుత్వం సకాలంలో ఆదుకోకపోవటం వల్లే అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. సకాలంలో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల... ధాన్యం బస్తాను 900 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని విమర్శించారు. వరుస విపత్తులతో నష్టపోయిన రైతులకు సరైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక, మద్దతు ధర అందక కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులిలా ఉంటే ...తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని సీఎం చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:
రావాల్సిన ఆదాయాన్ని పట్టించుకోరా ?: ఈఏఎస్ శర్మ

ABOUT THE AUTHOR

...view details