ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ కీలక భేటీ

కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

By

Published : Feb 10, 2022, 4:00 PM IST

Updated : Feb 10, 2022, 5:38 PM IST

15:58 February 10

కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

New Districts:కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్లానింగ్‌, రెవెన్యూ, హోంశాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ చర్యలు చేపట్టింది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కడపలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీంతో హిందూపురంలో ఆందోళనలు మొదలయ్యాయి. అన్ని సదుపాయాలు ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి. నోటిఫికేషన్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి.. అవసరమైతే రీ-నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదీ చదవండి :

సీఎం జగన్​తో సినీ ప్రముఖుల భేటీ.. వివరాలు ఇవే

Last Updated : Feb 10, 2022, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details