ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆపత్కాల సమయంలో ప్రతి ఒక్కరినీ ఆత్మీయుల్లా ఆదరించాలని పిలుపునిచ్చారు. వైకాపా నేతలు కరోనా ఉపద్రవాన్ని కూడా కాసులు పండించుకోవడానికి వినియోగించుకోవడం బాధాకరమని విమర్శించారు. పార్టీ సీనియర్ నేతలతో ఈ మేర చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలంతా కరోనా మహమ్మారి ప్రభావంతో ఆందోళన చెందుతుంటే.. వైకాపా నాయకులు ఇసుక, మట్టి అక్రమ రవాణాకు పాల్పడడం, ప్రజల ఆరోగ్యం కంటే.. ఆదాయ ఆర్జనే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, జిల్లాలో చేపల చెరువులకు దాణా సరఫరా నిలిచిపోవడంతో కోట్లాది రూపాయల పంట నాశనమవుతోందని తెలిపారు.
మెడ్‌టెక్ జోన్ నేటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు సంజీవనిగా ఉపయోగపడుతోందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా మెడ్‌టెక్ జోన్ గురించి ప్రస్తావించిన విషయాన్ని పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. కరోనా పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు సాధారణ సేవలు నిలిపివేయడం సరికాదని.... ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా పార్టీ నాయకులు చొరవ తీసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు.
బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి..