కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావనే లేదు: చంద్రబాబు - undefined
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలిపేందుకే నిరసనలు చేసినట్టు తెదేపా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చెప్పారు.
తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ చేశారు. కేంద్రం చివరి బడ్జెట్లోనూ రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకుండా ముగించారన్నారు. 5 ఎకరాల భూమి ఉంటే 500 రూపాయల భిక్ష వేస్తారా అని కేంద్రం తీరును తప్పుబట్టారు. భాజపా వైఫల్యం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. అయినా రాష్ట్రంలో 14 లక్షల మందికి ఉపాధి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కియా పరిశ్రమతోనే వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా నిన్న శాసనసభకు నల్ల చొక్కాలతో హాజరై నిరసన తెలిపిన సంఘటన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. కేంద్ర అన్యాయాన్ని నిలదీసేందుకే తీవ్ర నిరసనలు చేశామన్నారు. ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
TAGGED:
chandrababu tele conference