అసెంబ్లీ రద్దు సవాల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. గిరిజన ఆడబిడ్డలపై గ్యాంగ్ రేప్‌లపై ధ్వజమెత్తాలన్నారు. కల్తీ మద్యం, శానిటైజర్ తాగి అనేకమంది చనిపోవడంపై నిరసన తెలపాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని 3ముక్కల అంశం అజెండాగా.. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేయాలన్నారు. 48గంటల్లో స్పందించాలని ఛాలెంజ్ చేసినా సీఎం జగన్‌లో కదలిక లేదని నేతలు చంద్రబాబుకు వివరించారు. 13జిల్లాలలో వైకాపా బాధిత ప్రజానీకం పెరిగిపోయిందని ఎమ్మెల్సీలు తెలిపారు. ఓటమి భయంతోనే సవాల్‌కు స్పందించడం లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రాజధాని 3ముక్కల అంశాన్ని కావాలనే ఎన్నికల ముందు దాచిపెట్టారని..., ఎన్నికల్లో నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇది 5 కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటని చంద్రబాబు ధ్వజమెత్తారు.
'5 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు'
వైకాపా ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై దాడులు-దౌర్జన్యాలు, హత్యలు-అత్యాచారాలు, ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాల తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు.
chandrababu on cm jagan over 3 capitals