ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

chandrababu : 'రైతులు నష్టపోతే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు'

chandrababu in farmers meeting : మిరపకు తెగులు వచ్చి రూ.5 వేల కోట్ల నష్టం వచ్చిందన్న చంద్రబాబు.. రైతులు నష్టపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మూతపడిందని విమర్శించారు. వర్షాకాలంలో విద్యుత్ కోతలుంటే ఇక వేసవి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

chandrababu
chandrababu

By

Published : Mar 4, 2022, 7:27 PM IST

Updated : Mar 4, 2022, 9:06 PM IST

chandrababu in farmers meeting : మిరపకు తెగులొచ్చి రూ.5వేల కోట్లు రైతులు నష్టపోతే.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. వర్షాకాలంలోనే విద్యుత్ కోతలు ఉంటే ఇక వేసవి పరిస్థితి ఏంటని నిలదీశారు.

అప్పుల కోసం కక్కుర్తిపడి.. వ్యవసాయ మోటర్లకు మీటర్ల పేరుతో రైతులకు జగన్ రెడ్డి ఉరితాళ్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని వారు మీటర్ల బిల్లు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. రైతులు చేసే ప్రతీపోరాటానికి తెలుగుదేశం అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

బాబు రావాలి.. రైతు గెలవాలి
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో 'రైతు గెలవాలి – వ్యవసాయం నిలవాలి' అంశంపై తెలుగు రైతు ఆధ్వర్యంలో 3రోజుల రాష్ట్రస్థాయి కార్యశాల ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కార్యకర్తలు గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. తెలుగు రైతులు చంద్రబాబుని ఎడ్లబండిపై ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు.రైతు గెలవాలంటే చంద్రబాబు రావాలంటూ నినాదాలు చేశారు. ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి దాదాపు రూ.10వేల కోట్లపైగా ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో ఒక్క ఏకరాకూడా ఎండలేదని.. రైతులు నష్టపోకుండా విద్యుత్ సంస్కరణలకు తెదేపా శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

డబ్బులెక్కువుండే వ్యక్తి జగన్.. అప్పులెక్కువ ఉండేది రైతులు
రాష్ట్రంలో ఎక్కువ డబ్బు ఉండే వ్యక్తి జగన్...ఎక్కువ అప్పులు ఉండే వారు తెలుగు రైతులని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జగన్​కు అమూల్​పై ఎందుకు అంత ముద్దు...అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాష్ట్ర ఆస్తులు దానం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లుపై గుంతలు పూడ్చలేని వాళ్లు.. ఊరికో విమానాశ్రయం కడతా అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే క్యాసినో సంస్కృతిని రాష్ట్రానికి తెచ్చారని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చే సన్నా వడ్డీని.. గుండు సున్నా చేశారన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి రైతు భరోసా అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబాయ్ చనిపోతే.. నా చేతిలో గొడ్డలి పెట్టారు
వైఎస్ కోటలో బాబాయ్ చనిపోతే తన చేతిలో గొడ్డలి పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. వివేకా గొడ్డలి పోటుకు గురైతే.. గుండె పోటుతో చనిపోయారు అని ప్రచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు వాస్తవాలు అన్ని బయటకు వస్తున్నాయని వెల్లడించారు. తెలుగుదేశం తిరుగులేని పునాదిపై వచ్చిన పార్టీ.. ఎవరూ ఏమీ చెయ్యలేరని స్పష్టం చేశారు. జగన్​కు వచ్చిన ఒక్క ఛాన్స్.. చివరి ఛాన్స్ అవుతుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి :మేము అధికారంలో ఉంటే.. ఈ పాటికి పోలవరం ఉరకలెత్తేది: చంద్రబాబు

Last Updated : Mar 4, 2022, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details