హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో వైకాపాకు మద్దతుగా.. పోలీసులు అక్రమ నిర్బంధాలు చేపట్టడం అనైతికమని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో సర్పంచి అభ్యర్థి భర్త సునీల్ కుమార్, మండల తెదేపా అధ్యక్షుడిని అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
'ఎన్నికల్లో ఓడిపోతారనే అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు': చంద్రబాబు
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఓడిపోతారనే భయంతో.. అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా కాకుమానులో సర్పంచి అభ్యర్థి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన ఖండించారు.
'ఎన్నికల్లో ఓడిపోతారనే అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు': చంద్రబాబు