ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yerrannaidu Birth Anniversary: 'జాతీయ రాజ‌కీయాల్లో ఎర్రన్నాయుడు త‌న‌దైన ముద్ర వేశారు' - ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళులు

Yerrannaidu Birth Anniversary: తెదేపా సీనియర్‌ నేత దివంగత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా.. పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​లు నివాళులర్పించారు.

chandrababu and lokesh pays tributes to Yerrannaidu on his birth anniversary
జాతీయ రాజ‌కీయాల్లో ఎర్రన్నాయుడు త‌న‌దైన ముద్ర వేశారు: చంద్రబాబు

By

Published : Feb 23, 2022, 1:25 PM IST

Yerrannaidu Birth Anniversary: తెదేపా సీనియర్‌ నేత దివంగత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా.. పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ నివాళులర్పించారు.

సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన కింజరాపు ఎర్రన్నాయుడు జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. తాను పుట్టిన ఉత్తరాంధ్రకే కాకుండా.. తెలుగు వారందరికీ పేరు తెచ్చిన ఎర్రన్నాయుడు తనకు అత్యంత ఆప్తులని గుర్తు చేశారు.

ప్రజానేతగా ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకుని, పార్లమెంటేరియన్ గా జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసిన తెలుగుతేజం ఎర్రన్నాయుడని.. నారా లోకేశ్​ కొనియాడారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందామని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

KIA RECORD: అనంతపురం కియా యూనిట్‌ రికార్డు... రెండున్నరేళ్లలో..

ABOUT THE AUTHOR

...view details