CBN and lokesh fires on govt: శ్రీకాకుళం జిల్లా పొత్తంగి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు వేధించడం వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకే వేధించి ప్రాణాలు తీశారన్నారు. మృతుడి కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్నది పోలీసులా ?, వైకాపా నాయకుల అనుచరులా ?
పోలీసుల వైఖరి చూస్తే.. రాష్ట్రంలో ఉన్నది పోలీసులా ?, వైకాపా నాయకుల అనుచరులా ? అనే అనుమానం వస్తోందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైకాపా అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిని ఇలా చంపుకుంటూ పోతే.. రాష్ట్రంలో వైకాపా నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారన్నారు. కోన వెంకట్రావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.