ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మరింత పటిష్టంగా లాక్​డౌన్ అమలు​ - కరోనాపై ఏపీ పోరు

కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ ఇవాళ సమావేశమైంది. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను అధికారులు వారికి వివరించారు. లాక్​డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు, రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు.

ap task force committee
ap task force committee

By

Published : Mar 28, 2020, 4:00 PM IST

మీడియాతో మంత్రి కన్నబాబు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సీఎం జగన్ నేతృత్వంలో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని మంత్రుల బృందం వెల్లడించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులైన మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత విజయవాడలోని ఆర్​ అండ్​ బీ భవనంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై చర్చించారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..

⦁ ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేయడం

⦁ మార్కెట్​లలో రద్దీని తగ్గించేలా చర్యలు

⦁ సామాజిక దూరం పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించడం

⦁ నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడటం

⦁ నిరుపేదలు, వలస కూలీలకు భోజన, వసతి సదుపాయం కల్పించేలా చర్యలు

⦁ అక్వా రంగాన్ని ఆదుకునేలా చర్యలు

⦁ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటం

ఈ సమావేశంలో మంత్రులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్లు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రకాశం సరిహద్దులో వేల మంది కూలీల అడ్డగింత

ABOUT THE AUTHOR

...view details