SAAP chairman విజయవాడ మున్సిపల్ క్రీడా మైదానంలో వేసవి శిక్షణా శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆ సంస్థ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గైర్హాజరయ్యారు. అధికారులు, వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడా బైరెడ్డి పేరు ఎత్తకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరును అధికారులు ప్రస్తావించకపోవడంతో.. క్రీడా శిక్షకులు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే బైరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారానికి ఈ ఘటన మరింత బలపడినట్లయింది. ఉద్దేశపూర్వకంగా బైరెడ్డి పేరును చెప్పలేదా అనే చర్చ కొనసాగుతోంది.
వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గైర్హాజరు - విజయవాడలో వేసవి శిక్షణా శిబిరాల ప్రారంభానికి హాజరుకాని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
విజయవాడ మున్సిపల్ క్రీడా మైదానంలో 'శాప్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరానికి ఆ సంస్థ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. మంత్రి రోజా వచ్చినా.. ఆ కార్యక్రమానికి బైరెడ్డి గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
విద్యార్థులకు ఆటలు ఆరోగ్యాన్ని ఇవ్వటంతో పాటు పతకాలను తెచ్చిపెడతాయి. కొవిడ్ వల్ల రెండేళ్లపాటు క్రీడాకారులు ఆటలకు దూరమయ్యారు..'శాప్' ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామం. రాష్ట్రవ్యాప్తంగా 48 క్రీడా విభాగాల్లో 1,670 వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాం. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వం.. మంచి ప్రోత్సాహకాలు అందిస్తోంది. -రోజా, మంత్రి
ఇదీ చదవండి: కరెంటు పెట్టిన కఠిన పరీక్ష.. కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థుల చదువు
TAGGED:
summer training camp