ఇదీ చదవండి:
'నివాసమున్న చోటే.. ఇళ్ల స్థలాలు కేటాయించాలి' - పేదల ఇళ్ల స్థలాలపై బొండా ఉమ
అర్హులందరికీ వాళ్లు నివాసం ఉంటోన్న ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్ త్రీ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేయాలని కోరుతూ విజయవాడ సెంట్రల్ వాంబే కాలనీలోని గృహాల సముదాయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కుట్రపూరిత ధోరణితో పేదలకు అమరావతి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పడం తుగ్లక్ నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల ఇళ్ల స్థలాలపై బొండా ఉమా వ్యాఖ్య
జనాభా లెక్కల సేకరణలో కులగణన లేనట్లే