నెల్లూరులో చిక్కుకుపోయిన ఒడిశాకు చెందిన 30 మందికి పైగా కార్మికులకు 10 రోజులుగా కనీసం రేషన్ కూడా ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని.. బీజేడీ ఎంపీ అమర్ పట్నాయక్ ట్వీట్ చేశారు. ఏపీ నుంచి ఒడిశాకు కాలినడకన బయల్దేరి రావటం మినహా వారికి వేరే దారి లేదంటూ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో వారు కాలి నడకనే ఒడిశాకు బయల్దేరాలని నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్ చేశారు.
వాళ్లకు సాయం చేయడంలో ఏపీ విఫలం: ఒడిశా ఎంపీ - ఏపీకి వలస కార్మికులపై పట్టింపులేదని బీజేడీ ఎంపీ కామెంట్స్
ఏపీ ప్రభుత్వంపై బీజేడీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకున్న ఒడిశాకు చెందిన వలస కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినా.. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

వాళ్లకు సాయం చేయడంలో ఏపీ విఫలం: ఒడిశా ఎంపీ