ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు సహకరించాలని ఆంద్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కోరింది. రైతుల ప్రయోజనాలను భంగం కలిగిస్తూ గిట్టుబాటు ధరలు లేకుండా కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉన్న 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. 10 రోజులుగా పెద్ద సంఖ్యలో దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారని.. అయినా కేంద్ర ప్రభుత్వం వారి ఉద్యమాన్ని అవమానపరిచేలా వ్యవహరిస్తోందని సమితి నేతలు విమర్శించారు. ఈ చట్టాల విషయంలో ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని కోరారు.
'ఈనెల 8న భారత్ బంద్.. అన్ని వర్గాలు సహకరించండి' - భారత్ బంద్ వార్తలు
ఈనెల 8న రైతు సంఘాల భారత్ బంద్‌కు అందరూ సహకరించాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కోరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. ఈ బంద్ చేపడుతున్నట్లు సమితి నేతలు తెలిపారు.
రైతు సంఘాల సమితి సమావేశం