వైద్యులు లేరన్న కారణంతో సుమారు 670 మంది ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులను విధులనుండి తప్పించడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయుష్ పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. ప్రభుత్వ తప్పిదాల వలన 670 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, తక్షణమే వారిని విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని మధు అన్నారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని.....డిప్యుటేషన్‌పై వైద్యులను నియమించి ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"ఆయుష్ ఉద్యోగులను తొలగించటం అన్యాయం"
ఆయుష్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
"వైద్యులు లేరన్న కారణంతో.... ఆయుష్ ఉద్యోగులను తొలగించటం అన్యాయం"