ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"అట్రాసిటీ చట్టంపై అవగాహన అవసరం" - vijayawada

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై మరింత అవగాహన అవసరమని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు.

బేర్ ఫుట్ లాయర్స్ ప్రాజెక్టు

By

Published : Aug 8, 2019, 11:14 PM IST

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం

దళితుల్లో చట్టాలపై అవగాహన తెచ్చేందుకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ సహకారంతో... శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ బేర్ ఫుట్ లాయర్స్ పేరుతో ఓ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. విజయవాడ ఐఎంఏ హాల్​లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రాజెక్ట్ ను, టోల్ ఫ్రీ నెంబర్ను ప్రారంభించారు. గ్రామాల్లో దళితులపై దాడులు జరుగుతున్నా.. ఎస్సీ ,ఎస్టీ చట్టాలపై అవగాహన లేకపోవటంతో ముందుకు రాలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో మనుషుల మధ్య అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధునిక కాలంలో సైతం అంటరానితనం రూపుమాపలేకపోవటం బాధాకరమన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న ఎస్సీ ,ఎస్టీ కేసుల్లో నిందితులకు శిక్షపడే సంఘటనలు తక్కువగా ఉన్నాయని శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ రెబెకా రాణి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు కళాశాలలు, విద్యాసంస్థలు, గ్రామాల్లో యువతకు చట్టాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. శిక్షణ తీసుకున్న పారాలీగల్స్.. దళితులకు అండగా ఉండి వారికి న్యాయ సహాయం చేస్తారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details