ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రశ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే దాడులు.. ఇదే ప్రభుత్వ పాలన'

అవినీతిని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ.. అక్రమాలను ఎదిరిస్తున్న వారిపై దాడులు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పాలన సాగుతోందని.. తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రెండోరోజు మహానాడులో అక్రమ కేసులపై తీర్మానం ప్రవేశపెట్టారు.

ayyanna patrudu in mahanadu
మహానాడులో అయ్యన్నపాత్రుడు

By

Published : May 28, 2020, 3:34 PM IST

Updated : May 28, 2020, 4:51 PM IST

ప్రభుత్వ పాలనపై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు

అధికారంలో ఉన్నప్పుడు పార్టీ జెండా ప్రతి ఒక్కరూ మోస్తారనీ.. కష్టాల్లో ఉన్నప్పుడు మోసేవారే నిజమైన నాయకులు, కార్యకర్తలని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. రెండోరోజు మహానాడులో అక్రమ కేసులు, ఆస్తుల విధ్వంసం, పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం పేరిట అయ్యన్నపాత్రుడు తీర్మానం ప్రవేశ పెట్టగా.. అబ్దుల్ అజీజ్ దాన్ని బలపరిచారు. జైలుకు వెళ్లొచ్చిన వాళ్లు న్యాయవ్యవస్థను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర డీజీపీని సీఎం జగన్ కోర్టు ముందు నిలబెట్టారన్న అయ్యన్న... ముఖ్యమంత్రి తప్పు చేస్తుంటే చెప్పాల్సిన బాధ్యత డీజీపీకి ఉందని హితవు పలికారు.

అవినీతి చేయడానికి బ్లీచింగ్ పౌడర్​ను కూడా వదలడంలేదని ఆరోపించారు. విశాఖలో విజయసాయి అండ్ కో భూములను కాజేస్తుంటే.. పోలీసులు అండగా ఉంటున్నారని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తుంటే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిపై దాడులు చేస్తూ.. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందని ఆక్షేపించారు.

ఇవీ చదవండి... 'సీఎం జగన్​.. కోర్టులను సైతం లెక్క చేయడం లేదు'

Last Updated : May 28, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details