ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ రాజభవనాల సోకులకు.. రాష్ట్ర బడ్జెట్ సరిపోవడం లేదని.. తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందే నిర్మాణం పూర్తయిందన్న ఇంటికి.. ఇప్పుడు కరెంట్ పనికి, సోఫాలు, కుర్చీలకు రూ. 4 కోట్ల రూపాయలు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు.
అది ఇల్లా, మాయా మహలా అంటూ మండిపడ్డారు. రంగులు, హంగులు, సోకులకు ప్రజా ధనం వృథా చేయడం మాని.. సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజాధనంతో దుబారా ఖర్చు చేయడం సీఎం జగన్కు సబబు కాదన్నారు. ఈ విషయంపై అయ్యన్నపాత్రుడు ఓ ట్వీట్ చేశారు.