విశాఖ గ్యాస్ లీకేజీ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. నిద్రపోతున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగటం చాల బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
'గ్యాస్ లీకేజీ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి' - 'గ్యాస్ లీకేజీ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి'
విశాఖ ఘటన దురదృష్టకరమైనదని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
విషవాయువు పీల్చిన గర్భిణులకు పుట్టబోయే పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు పరిగణలోకి తీసుకొవాలని డిమాండ్ చేశారు.