ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విధుల్లోకి తీసుకోవాలని ఆయుష్ సిబ్బంది విజ్ఞప్తి

ఆయుష్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా.. ఆర్థికశాఖలో గత 7 నెలలుగా ఆ ఫైలు పెండింగ్ లోనే ఉందని ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

ayush employees
ayush employees

By

Published : Sep 2, 2020, 7:13 PM IST

గత 40 నెలలుగా ఆయుష్ సిబ్బంది కొనసాగింపు కొరకు ఎదురుచూపులు చూస్తున్నారని ఆయుష్ పారామెడికల్ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, జాతీయ ఆరోగ్య పథకం క్రింద గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆయుష్ పారామెడికల్ సిబ్బందిని, వైద్యులు లేరన్న నెపంతో 700 మంది ఆయుష్ కుటుంబాలను అన్యాయంగా రోడ్డుపాలు చేసిందన్నారు. కాంట్రాక్టు ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ నాగేశ్వరరావు అన్నారు.

విధుల్లోకి తీసుకొని డాక్టర్లను భర్తీ చేయాలని కోరుతూ గతంలో విజయవాడ ధర్నాచౌక్ వద్ద రిలే దీక్షలు చేపట్టిన బాధితులకు.. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే విధుల్లోకి తీసుకుంటామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయుష్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆర్థికశాఖలో గత 7 నెలలుగా ఆ ఫైలు పెండింగ్ లోనే ఉందన్నారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:నిండు చూలాలును మంచంపై మోస్తూ.. 5 కి.మీ కాలినడకన..

ABOUT THE AUTHOR

...view details