సమాజంలో స్వీయ చరిత్రలు, ఆత్మకథలకు విశిష్ట స్థానం ఉందని ప్రముఖ రచయితలు పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు, జీవిత కథల గురించి చర్చించింది చాలా తక్కువ అని.. ఆత్మకథలు దశాబ్దాల కిందటి నాటి సామాజిక స్థితిగతులు, ప్రజల జీవిత విధానాలను తెలియజేస్తాయన్నారు. 50 ఏళ్లు, వందేళ్ల నాటి పరిస్థితులు ఆత్మకథల ద్వారానే తెలుసుకోగలమని అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ వంటివాటి ద్వారా ప్రజల్లో ఆత్మకథల పట్ల ఉత్సుకత పెరిగిందని.. ఆత్మకథలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం తెలుగు సాహిత్యంలో ఉందని వక్తలు వ్యాఖ్యానించారు.
'ఆత్మకథలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది'
'తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు' అంశంపై విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ.. సిద్ధార్థ కళాపీఠం సంయుక్తంగా ఈ సదస్సు ఏర్పాటు చేసింది. తెలుగు భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ రచయితలు సదస్సులో పాల్గొన్నారు.
ఆత్మకథలను ప్రోత్సహించాలి