తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని వైద్య సిబ్బందితో కలిసి... ఆశా కార్యకర్తలు ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఈ సర్వేలో కొంతమంది తమకు సహకరించడం లేదని... వివరాలు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కలిపిస్తేనే సర్వే నిర్వహిస్తామని తెలిపారు. పాలనాధికారి జోక్యం చేసుకొని రక్షణ కల్పిస్తామని ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చారు. సర్వే చేయాలని సూచించారు.
సహకరించకుండా బెదిరిస్తున్నారంటూ ఆశా కార్యకర్తల ఆందోళన - ఆశా కార్యకర్తల ఆందోళన
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సర్వే చేపడుతుంటే ప్రజలు సహకరించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.
asha-workers-protest-at-collector-office-in-nirmal