ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మంత్రివర్గంలో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యమివ్వాలి' - jagan

ఆర్యవైశ్యులకు త్వరలో ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంలో జగన్ ప్రాధాన్యత ఇవ్వాలని.. తమ కార్పొరేషన్​కు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కోరారు.

ఆర్యవైశ్య మహాసభ సభ్యులు

By

Published : May 27, 2019, 8:04 AM IST

'మంత్రివర్గంలో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యమివ్వాలి'
ఆర్యవైశ్యులకు వైకాపాలో అత్యధికంగా సీట్లు ఇచ్చినందుకు పార్టీ అధినేత జగన్​కు ప్రపంచ ఆర్య వైశ్యమహాసభ కృతజ్ఞతలు తెలిపింది. వైకాపా నుంచి ఎమ్మెల్యేలుగా ముగ్గురికి అవకాశం ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసింది. వైశ్యులకు జనాభా ప్రాతిపదికన పార్టీలో మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని నూతన ప్రభుత్వాన్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ కోరారు . వైశ్య కార్పొరేషన్​కు వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని విజయవాడలో మీడియా సమావేశంలో కోరారు. నూతనంగా ఏర్పడే ప్రభుత్వంలో వైశ్యులకు సముచిత స్థానం కల్పించాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details