ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APCC president sailajanath: 'రాష్ట్రవ్యాప్తంగా జనజాగరణ యాత్ర చేపడతాం'

రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రాష్ట్రంలో పాదయాత్రలు, ఆందోళనలు చేపట్టబోతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ తెలిపారు. అలాగే అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వివరించారు.

apcc president shailajanath speaks about congress janajagarana yatra
'రాష్ట్రవ్యాప్తంగా జనజాగరణ యాత్ర చేపడతాం..'

By

Published : Nov 3, 2021, 9:59 AM IST

'రాష్ట్రవ్యాప్తంగా జనజాగరణ యాత్ర చేపడతాం..'

ప్రజలను లూటీ చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆరోపించారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని వివరించారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు మోయలేని విధంగా నిత్యావసర, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీఎం జగన్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా పాదయాత్రలు, ఆందోళనలు చేపట్టాలని అదిష్ఠానం నిర్ణయించిదన్నారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నిస్తే అన్యాయంగా కేసులు పెడుతున్నారని... ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియ చెప్పేలా జన జాగరణ యాత్ర చేపడతామన్నారు. 14వ తేదీన యాత్ర విజయవాడలో లాంఛనంగా ప్రారంభిస్తామని శైలజానాథ్ వివరించారు. అలాగే 18వ తేదీ నుంచి 29 వరకు వరుసగా యాత్రలతో పాటు, ఆందోళనలు చేపడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details