ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజారంజక పాలన అయితే.. పోలీసుల పహారా ఎందుకు?'

అపాయింట్​మెంట్ కోరుతూ ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాస్తే అనుమతించకపోగా.. తమను అక్రమంగా అరెస్టు చేయించారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని వ్యాఖ్యానించారు. చర్చించేందుకు మరోసారి ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ కోరుతామన్నారు.

pcc chief sailajanath
pcc chief sailajanath

By

Published : Dec 5, 2020, 7:35 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి ప్రజారంజక పాలనే అందిస్తుంటే వేలాది మంది పోలీసుల పహారా ఎందుకని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధాని అమరావతి, వ్యవసాయ చట్టాలు, పంపు సెట్లకు మీటర్ల బిగింపు వంటి అంశాలపై మాట్లాడాలని సీఎంకు లేఖ రాస్తే.. అనుమతించకపోగా తమను అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. లక్షలాది ప్రజలను, అమరావతి రైతులను ఇంకెంత కాలం పోలీసుల నిర్బంధంలో ఉంచుతారని అన్నారు. నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని వ్యాఖ్యానించారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విధానం చూస్తుంటే రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని శైలజానాథ్ అన్నారు. వైకాపా నేతలకు అరవటం ఒకటే తెలుసని ఎద్దేవా చేశారు. మరోసారి ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ కోరుతూ లేఖ రాస్తామన్నారు. అప్పుడు కూడా స్పందన లేకుంటే ఏమి చేయాలో తమకు తెలుసన్నారు.

ABOUT THE AUTHOR

...view details