ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నగదు బదిలీ పథకాలు.. ఎన్నికల ప్రచారానికి వద్దు - ec

నగదు బదిలీ పథకాలను రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవటం నిబంధనలకు విరుద్ధమని  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.  సంక్షేమ పథకాల అమలును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే పర్యవేక్షిస్తుందని.. యంత్రాంగం అంతా ఈసీ పరిధిలోనే పనిచేస్తోందని చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

By

Published : Apr 3, 2019, 10:18 PM IST

నగదు బదిలీ పథకాలను రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవటం నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే పర్యవేక్షిస్తుందని.. యంత్రాంగం అంతా ఈసీ పరిధిలోనే పని చేస్తోందని చెప్పారు.డూప్లికేట్ ఓట్ల నమోదుపై వస్తున్న ఫిర్యాదులు ఈఆర్​ఓలే పరిష్కరించాలని ద్వివేది స్పష్టం చేశారు.ఆన్​లైన్​తో పాటు మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేయటం వల్లే డబుల్ ఎంట్రీలు వచ్చినట్టు తెలిపారు. బూత్ లెవల్ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని డేటా ఎంట్రీ చేయటంలోనూ పొరపాట్లు దొర్లాయని ఆయన అన్నారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కౌంటింగ్ తేదీ వరకూ పోస్టల్ బ్యాలెట్​ను వినియోగించుకునే అవకాశముందన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు చేస్తున్నారని, పెద్ద ఎత్తున నగదు కూడా స్వాధీనం చేసుకుంటున్నామనిరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితెలిపారు. 90 కోట్ల 71 లక్షల రూపాయల నగదునుపోలీసుల తనిఖీల్లో, 4 కోట్ల 68 లక్షల రూపాయలు ఐటీ శాఖ అధికారుల సోదాల్లో పట్టుకున్నారని చెప్పారు.
బిల్లులు లేకుండా తరలిస్తున్న 91 కేజీల బంగారం, 256 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఓటర్లను ప్రలోభపరిచేందుకు తరలిస్తున్న 17 వేల 528 లీటర్ల మద్యాన్నిస్వాధీనపర్చుకున్నట్టు ద్వివేది తెలిపారు. జిల్లా, అంతర్రాష్ట్ర తనిఖీల్లో 1164 కేజీల గంజాయి, 7కోట్ల విలువైన చీరలు, గుట్కాలు, ఫోన్లు, దుస్తులు, పాన్‌ మసాలా స్వాధీనం చేసుకున్నామన్నారు.

For All Latest Updates

TAGGED:

ecDVIVEDI

ABOUT THE AUTHOR

...view details