ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలి: ఏపీఎన్జీవో

సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ హామీలను సత్వరమే నెరవేర్చాలని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొవిడ్ బారిన పడిన ఉద్యోగులకు నెల రోజులు సీఎల్​లు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలం మంజూరు చేయాలన్నారు.

ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలి
ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలి

By

Published : Nov 22, 2020, 7:31 PM IST

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ అంశాలను సత్వరమే నెరవేర్చాలని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రిని కలసి కోరినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్​.చంద్రశేఖర రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన 11వ పీఆర్సీని 1.7.2018 నుంచి అమలు చేయాలని కోరారు. పే రివిజన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించినందున దీనిపై వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చించి 11వ పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన 3 డీఏలను విడుదల చేసి.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు తగ్గించిన వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.

ఎరియర్స్ లేకుండా డీఏలు చెల్లించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు... ప్రతి 6 నెలలకు వచ్చే కరవు భత్యాన్ని విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు, మహిళా టీచర్లతో సమానంగా ఏడాదికి 5 సీఎల్​లు అదనంగా ఇవ్వాలన్నారు. జీపీఎఫ్, ఎపీజేఎల్ లోన్​ల జాప్యం కాకుండా సకాలంలో చెల్లించాలని కోరారు. కొవిడ్ బారిన పడిన ఉద్యోగులకు నెల రోజులు సీఎల్​లు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలం మంజూరు చేయాలన్నారు. మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయించినందున విశాఖపట్నంలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అసోషియేషన్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details