- బైడెన్ అనే నేను
అమెరికా ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటేశారని.. వారి విశ్వాసాన్ని నిలబెడుతూ, దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తామని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచిన తర్వాత డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో డెమొక్రాట్లు తొలి సభ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- మొండిగా ఆరోపించడమా.. హుందాగా వైదొలగడమా?'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శైలి ప్రపంచానికి తెలియంది కాదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లనే రకం. ఓటమిని అంగీకరించరు. కానీ ఇప్పుడు ఫలితాలు తేలిపోయాయి. భారీ తేడాతో ట్రంప్ ఓడిపోయారు. ఇప్పుడు ట్రంప్ ముందున్న మార్గాలేంటి? ఆయనకు సన్నిహితులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఆయన ఎలాంటి ప్రణాళికల్లో ఉన్నారు?పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు
అమరావతి రైతులకు బేడీలు వేసిన ఘటనలో ఏపీసీఎల్ఏ అధ్యక్షుడి ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కుటుంబం ఆత్మహత్య కేసు
కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐజీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ నంద్యాలకు చేరుకుంది. అర్ అండ్ బీ అతిథి గృహంలో ఇతర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- తెదేపా శ్రేణుల ఆందోళన
కాపు కల్యాణ మండపాలను త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందని వారు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- నోట్ల రద్దుతో మోదీ మిత్రులకే మేలు
నాలుగేళ్ల క్రితం చేపట్టిన నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ మిత్రులైన కొంతమంది పెట్టుబడిదారులకే అది సహాయపడిందన్నారు. నోట్ల రద్దు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు రాహుల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ముగ్గురు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ మాచిల్ ప్రాంతంలో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లతో పాటు ఓ బీఎస్ఎఫ్ సైనికుడు వీర మరణం పొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఆర్సీబీ.. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించగలదా?
ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం విరాట్‌ను పక్కనపెట్టే నిర్ణయం తీసుకోదంటూ అందుకు గల కారణాలను వివరించారు క్రికెట్ నిపుణులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్.. ఎక్కడికి?
అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు.. కుటుంబంతో పాటు ఎక్కడికో ప్రయాణమయ్యారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..