తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత రక్షణ కిట్లు అందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలందిస్తున్న కార్మికులకు రూ.25 వేలు అలవెన్సులు ఇచ్చి, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.
విజయవాడలో పారిశుద్ధ్య కార్మికుల అందోళన - విజయవాడ నేటి వార్తలు
విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. లాక్డౌన్ సమయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో పారిశుద్ధ్య కార్మికుల అందోళన