తన సస్పెన్షన్‌పై తెలుగుదేశం శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు సభాపతి తమ్మినేని సీతారామ్‌కి లేఖ రాశారు. పింఛన్‌పై మంత్రి సమాధానానికి సంతృప్తి చెందకపోవటంతో, తన స్థానం నుంచే నిరసన తెలిపానని లేఖలో పేర్కొన్నారు. తాను సీట్లో ఉన్నప్పటికీ, తనను సస్పెండ్ చేయటంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఎటువంటి వాగ్వాదానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు తాను పాల్పడలేదని లేఖ ద్వారా సభాపతి దృష్టికి తీసుకువచ్చారు. మార్షల్స్ తో బయటకు పంపి తనను అవమానించారని ఆరోపించారు. శాసనసభ్యుడినైన తన హక్కులు హరించారని, అన్యాయంగా తనపై తీసుకున్న చర్యలను పున:పరిశీలించాలని సభాపతిని కోరారు.
శాసనసభ్యుడి హక్కులు హరించారు: అచ్చెన్నాయుడు - speker
తనపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారని సభాపతికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. వెంటనే ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.
సభాపతికి లేఖ రాసిన అచ్చెన్నాయుడు