పోలీసుశాఖలో ఏబీసీడీ పురస్కారాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రదానం చేశారు. పలు కీలక కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులకు ఈ బహుమతులను అందజేస్తారు. మాజీ సీఎం పీఏ పేరుతో... డబ్బును డిమాండ్ చేసిన కేసును ఛేదించిన సైబర్ క్రైమ్ సీఐ గోపినాథ్ మెుదటి బహుమతి అందుకున్నారు. విజయనగరం పేపర్ లోడ్ కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ పాపారావుకు రెండో బహుమతి, రైల్వేకోడూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కేసులో నిందితులను పట్టుకున్న సీఐ బాలయ్యకు 3వ బహుమతి లభించాయి.
ఉత్తమ పోలీసులకు ఏబీసీడీ పురస్కారాలు - savang
పోలీసుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు పురస్కారాలు అందజేశారు. పలు కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసులను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డులు అందజేశారు.

ఏబీసీడీ పురస్కారాలు