వాలంటీర్ల నియామకంపై హైకోర్టులో పిటిషన్ - village volunteers
ప్రతిభ ఆధారంగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైకోర్టు
గ్రామ వాలంటీర్ల పోస్టులను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థులను భర్తీ చేయటం సరికాదని... విద్యార్హత ఆధారంగా వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కోరారు. నియామకానికి సంబంధించిన జీవో 104 లోపభూయిష్టంగా ఉందని... దీని అమలును నిలుపుదల చేయాలని ఆయన వ్యాజ్యంలో కోరారు.