ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలకు విశేష స్పందన - interviews

గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు యువత నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్వ్యూలకు 9 లక్షలకు పైగా హాజరయ్యారు. రెండు, మూడు రోజుల్లో వాలంటీర్లను అధికారులు ఎంపిక చేయనున్నారు.

నిరుద్యోగులు

By

Published : Jul 26, 2019, 6:58 AM IST

గ్రామ వాలంటీర్ల పోస్టులకు ఈనెల 11 నుంచి నిర్వహించిన ఇంటర్వ్యూలు గురువారంతో ముగిశాయి. వీటిలో పట్టణ వాలంటీర్ల పోస్టులకు అనూహ్య స్పందన లభించింది. కేవలం నలుగురు మినహా మొత్తం అభ్యర్థులంతా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 110 పట్టణాల్లో 1,58, 474 మందికి సమాచారాన్ని పంపితే నలుగురు తప్ప మిగిలిన అభ్యర్థులంతా హాజరయ్యారు. పోటీ పరీక్షలకు 70 నుంచి 80 శాతం మాత్రమే హాజరు శాతం ఉంటుండగా... వాలంటీర్ల ఇంటర్వ్యూలకు భారీ స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వాలంటీర్ల నియామకం కోసం చివరి రోజు గురువారం వరకు 9,26,210 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిజర్వేషన్లు, ఇంటర్వ్యూలో అభ్యర్థుల ప్రతిభ, విద్యార్హతల ఆధారంగా 3 రోజుల్లో వాలంటీర్లను అధికారులు ఎంపిక చేయనున్నారు. 2,30,160 పట్టణ, గ్రామ వాలంటీర్లకు రాష్ట్రవ్యాప్తంగా 9,62,707 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 9,26,227 మందిని ఈనెల 11 నుంచి జరిగే ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. గ్రామాల్లో 7,67,753 మందిని పిలవగా 7,67,740 మంది వచ్చారు. గిరిజన ప్రాంతాల్లో 39,357 మందిని ఆహ్వానించగా 37,865 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు.

రెండు వారాలుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు మూడు విభాగాల్లో కలిపి జిల్లాల వారీగా హాజరైన వాలంటీర్ అభ్యర్థులను పరిశీలిస్తే...

జిల్లా ఇంటర్వూలకు హాజరైన అభ్యర్థులు
అనంతపురం 71,818
చిత్తూరు 64,002
తూర్పుగోదావరి 94,207
గుంటూరు 72,240
కృష్ణా 60,071
కర్నూలు 1,02,441
ప్రకాశం 63,209
నెల్లూరు 45,114
శ్రీకాకుళం 77,378
విశాఖపట్నం 95,455
విజయనగరం 66,848
పశ్చిమ గోదావరి 61,262
కడప 52,165
మొత్తం 9,26,210

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details