ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BRITAN OFFICIALS MET CM JAGAN: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి: సీఎం జగన్​ - బ్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని బ్రిటన్‌ అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. బ్రిటన్‌ ఉన్నతాధికారుల బృందం సభ్యులు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్​ను కలిశారు.

British officials met with Jagan
జగన్​ను కలిసిన బ్రిటన్‌ అధికారుల బృందం

By

Published : Aug 10, 2021, 7:21 PM IST

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను బ్రిటన్​ ఉన్నతాధికారుల బృందం సభ్యులు(Britan officials met cm Jagan) కలిశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ది గురించి అధికారుల బృందానికి జగన్ వివరించారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రంగాల గురించి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని బ్రిటన్‌ బృందాన్ని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. అనంతరం బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి జ్ఞాపిక అందజేశారు.

రాష్ట్రంలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్‌ అధికారుల బృందం(Britan officials) తెలిపింది. ఈ బృందంలో డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్​తోపాటు బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్ట్​మెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి పలువురు సభ్యులు ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details