ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ

హైదరాబాద్​లో అక్రమంగా నివసిస్తున్నవారు ఓటు హక్కు పొందుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. హైదరాబాద్​ అభివృద్ధి కోసం భాజపాకు మద్దతు పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ
పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ

By

Published : Nov 25, 2020, 2:27 PM IST

హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్ కొనసాగుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 75 వేల మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారన్న కేంద్ర మంత్రి.. దీనిపై తెరాస, మజ్లిస్‌లు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌, రోహింగ్యా ముస్లింలను రాజకీయ లబ్ధికోసం కాపాడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే..

పాతబస్తీలో రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించినట్లు చెబుతున్నారని.. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే రోహింగ్యాలపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

నివేదిక రాలేదు..

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై సమగ్ర నివేదిక కేంద్రానికి పంపలేదని స్మృతి ఇరానీ తెలిపారు. తెలంగాణ ఒక్క కుటుంబం కోసం కాదని... ఎందరో త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణకు టెక్స్‌టైల్‌ పార్కును మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్రం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్‌ పథకాన్ని అమలు చేసి ఉంటే కరోనా సోకిన పేదలకు లబ్ధి చేకూరేదని అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి:

'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు

ABOUT THE AUTHOR

...view details