విజయవాడలో ఆవార(amaravati walkers and runners association) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేన్సర్‌పై అవగాహన పరుగు నిర్వహించారు. ఐదేళ్లుగా ప్రతి ఆదివారం నిరంతరంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తలిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. కృష్ణా నదీ తీరాన సాగిన ఈ పరుగును ఆక్టోపస్ ట్రైనర్ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి శస్త్రచికిత్స నిపుణుడు డా. దేవేంద్రసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
5K RUN : ఆవార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేన్సర్‌పై అవగాహన పరుగు
విజయవాడలో ఆవార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేన్సర్‌పై అవగాహన పరుగు నిర్వహించారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి అదుపుతప్పకుండా జాగ్రత్త వహిస్తే... క్యాన్సర్‌ను అదుపు చేయవచ్చని పర్యావరణవేత్త, అవార వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అజయ్ కాట్రగడ్డ అన్నారు.
ఆవార స్వచ్ఛంద సంస్థ
ఆహారపు అలవాట్లు, జీవనశైలి అదుపుతప్పకుండా జాగ్రత్త వహిస్తే... క్యాన్సర్‌ను అదుపు చేయవచ్చని పర్యావరణవేత్త, అవార వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అజయ్ కాట్రగడ్డ అన్నారు. అరవింద పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ ప్లేట్, గ్లాసుల్లో ఆహారాన్ని స్వీకరించడాన్ని బహిష్కరించడం శుభపరిణామమని, దీని కోసమే కోవిడ్ వనంలో వందలాది అరటి, బాదం మొక్కలు నాటామని, ఇలాటి స్ఫూర్తిప్రదాతల వలనే ఈ నదీ పర్యావరణ ఉద్యమం ఇంత అవగాహన తీసుకొచ్చిందని ఆయన అన్నారు.
ఇదీచదవండి.