AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 3,396 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 29,838మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ నుంచి కొత్తగా 13,005 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78,746కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాలవారీగా కేసులు
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 516 కేసులు నమోదు కాగా.. కృష్ణా జిల్లాలో 494, పశ్చిమగోదావరి జిల్లాలో 398, గుంటూరు జిల్లాలో 360 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారీగా తగ్గిన కేసులు..
Covid Cases in India: మరోవైపు భారత్లో కొవిడ్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 3.42 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.39 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం మరణాలు: 5,01,114
- యాక్టివ్ కేసులు:13,31,648
- మొత్తం కోలుకున్నవారు:4,02,47,902
దేశంలో కొత్తగా 47,53,081 మందికి టీకా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,68,98,17,199 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona cases