ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @1PM - breaking news

...

1pm top news
ప్రధాన వార్తలు @1PM

By

Published : Apr 22, 2021, 12:59 PM IST

  • 'పరీక్షలు నిర్వహిస్తే.. 80 లక్షల మంది కరోనాబారిన పడతారు'
    పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరై.. విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడితే సీఎం జగన్‌ బాధ్యత తీసుకుంటారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్... ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
    విజయవాడలోని పాయికాపురం పాఠశాలలో కరోనా కలకలం రేగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి వైరస్ సోకినట్లు నిర్థరణ కావటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరోనా : అనుమానంతో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
    కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ వృద్ధుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నాగిరెడ్డిపల్లి పొలాల్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ఆస్తి నష్టం
    యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో 20 ఎకరాల్లో కంచె దగ్ధమైంది. ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 15 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు కరోనా
    సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. తమ సిబ్బందికి కరోనా వచ్చిందని ముగ్గురు న్యాయమూర్తులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండోసారి కొవిడ్​ను జయించిన యడియూరప్ప
    రెండోసారి కరోనా బారినపడిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వైరస్​ను జయించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్ఛార్జి అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇజ్రాయెల్​, సిరియా మధ్య పరస్పర దాడులు
    ఇజాయెల్​పై క్షిపణులతో సిరియా దాడులు జరిపింది. దీనికి ప్రతిగా సిరియాపై ఇజ్రాయెల్​ దాడికి దిగింది. ఇరాన్ జోక్యం కారణంగానే ఇజ్రాయెల్​, సిరియా మధ్య చాలా కాలం తర్వాత ఇలాంటి ఘటనలు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హైకోర్టులో వాట్సాప్​, ఫేస్​బుక్​కు చుక్కెదురు
    కొత్త ప్రైవసీ పాలసీల విషయంలో ఫేస్​బుక్​, వాట్సాప్​లకు​ దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్​ ఆఫ్ ఇండియా ఆదేశాలను అడ్డుకోవాలని దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అంతా మా బౌలర్ల చలవే.. డేవిడ్‌ వార్నర్‌
    బుధవారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ జట్టుపై 9 వికెట్ల తేడాతో సన్​రైజర్స్​ హైదరాబాద్​ గెలుపొంది టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు ఎవరేమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరో సినిమాకు పవన్​కల్యాణ్ గ్రీన్​సిగ్నల్
    ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న పవన్​కల్యాణ్.. మరో ప్రాజెక్టును ఒప్పుకొన్నారు. వచ్చే ఏడాది ఆ చిత్రం సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details