ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

6 నెలల్లో అలిపిరి కాలినడక మార్గం పనులు పూర్తి: తితిదే ఛైర్మన్ - తితిదే ఛైర్మన్ తాజా వార్తలు

అలిపిరి కాలినడక మార్గం ఆధునీకరణ పనులను డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

yv subbareddy
yv subbareddy

By

Published : Sep 28, 2020, 9:15 AM IST

అలిపిరి కాలినడక మార్గం ఆధునీకరణ పనులకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సౌజన్యంతో రూ.25 కోట్ల వ్యయంతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తితిదే ఛైర్మన్ తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళికులు రూపొందిస్తున్నామని చెప్పారు. రూ. 20కోట్ల వ్యయంతో ఎస్వీబీసీ నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఎస్వీబీసీ ఇంగ్లీష్, హిందీ ఛానళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కల్యాణోత్సవాలు ఆన్​లైన్​లో పెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details