ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం... కార్మిక నేతల అరెస్టు

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన 450 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ కార్మికులు మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాటలకు... అధికారంలోకి వచ్చాక చేసే పనులకు పొంతన లేకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం...కార్మిక నేతల అరెస్టు
మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం...కార్మిక నేతల అరెస్టు

By

Published : Nov 17, 2020, 4:17 PM IST

Updated : Nov 17, 2020, 6:30 PM IST

తిరుపతి నగరంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించడానికి భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు యత్నించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన 450 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ కార్మికులు మంత్రి ఎదుట నినాదాలు చేశారు.

ఒక్కో కార్మికునికి తక్షణమే పదివేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాటలకు... అధికారంలోకి వచ్చాక చేసే పనులకు పొంతన లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఇంటికి భారీగా చేరుకున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
Last Updated : Nov 17, 2020, 6:30 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details