ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

TIRUMALA
TIRUMALA

By

Published : Oct 14, 2021, 9:42 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎంపీలు గురుమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్ , భాజాపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details