అఫ్గానిస్తాన్‌లో ఉన్న ప్రవాస భారతీయులను క్షేమంగా దేశానికి తీసుకువస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో చెప్పారు. వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
"కాబుల్ లో ఉన్న ప్రతి భారతీయుడిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తుంది. ఇప్పటికే కేంద్ర స్థాయిలో అనేక రకాలైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ పనిలోనే ఉన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అందర్నీ జాగ్రత్తగా దేశానికి రప్పించే ప్రయత్నం చేస్తాం." - కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి