తిరుపతి శ్రీవారి సర్వదర్శనానికి మళ్లీ టోకెన్ల జారీ ప్రారంభం కానుంది. రేపట్నుంచి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో రోజూ ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు ఇస్తారు. శ్రీవారి దర్శనానికి ఒకరోజు ముందు వీటిని జారీ చేస్తారు. రోజుకు 3 వేల సర్వదర్శనం టోకెన్లను తితిదే జారీ చేయనుంది. టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి అనుమతిస్తారు.
రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ - తిరుమల వార్తలు
తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్లను సోమవారం నుంచి తితిదే జారీచేయనుంది. రోజుకు 3వేల సర్వదర్శన టోకెన్లను ఇవ్వనున్నారు.
రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ