ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD News Year Calendar: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ క్యాలెండర్లు

TTD New Year-2022 Calendar: తిరుమల తిరుపతి దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్​ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి ప్రత్యేక క్యాలెండర్‌.. దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

TTD News Year Calendar launched
TTD News Year Calendar launched

By

Published : Jan 1, 2022, 3:25 AM IST

Updated : Jan 1, 2022, 5:55 AM IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ క్యాలెండర్లు

TTD News Year Calendar launched: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రత్యేక క్యాలెండర్‌ను ముద్రించిన‌ట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 3డీ ఎఫెక్ట్​, సిల్వర్ కోటింగ్​తో ప్రత్యేకంగా రూపొందించిన 6 పేజీల క్యాలెండ‌ర్‌ను తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి అతిథి గృహంలో ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.

స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక్షంగా వీక్షించిన అనుభూతి కలిగేలా ఆధునిక పరిజ్ఞానంతో క్యాలెండర్‌ రూపకల్పన చేసినట్లు సుబ్బారేడ్డి చెప్పారు. 25 వేల క్యాలెండర్ల ముద్రించామని... ఒక్కోదాని ధర రూ. 450 అని వెల్లడించారు. తిరుమల, తిరుపతితోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ క్యాలెండర్‌ అందుబాటులో ఉంచామన్నారు.
ఇదీ చదవండి..

PDRP: జనవరి 7, 8 తేదీల్లో పోలవరం డ్యామ్‌ డిజైన్ రివ్యూ ప్యానెల్ భేటీ

Last Updated : Jan 1, 2022, 5:55 AM IST

ABOUT THE AUTHOR

...view details