ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి ప్రభుత్వ నిర్ణయానికై వేచి చూస్తున్నాం'

తిరుపతిలో అలిపిరి వద్ద కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాన్ని తితిదే ఈవో అనిల్​ సింఘాల్​ ప్రారంభించారు. ఏప్రిల్​ 7న ఒంటిమిట్టలో జరగనున్న కల్యాణానికి ప్రభుత్వం అనుమతి కోరినట్లు తెలిపారు.

ttd EO speaks on ontimitta marriage
ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తున్న తితిదే ఈవో

By

Published : Mar 14, 2020, 11:46 AM IST

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహణపై స్పష్టత కోసం ఆరోగ్యశాఖ కమిషనర్​కు లేఖ రాసినట్లు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుపతిలో అలిపిరి వద్ద కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. ఈ తరుణంలో ఏప్రిల్​ 7న జరగనున్న రాముల వారి కల్యాణానికి లక్షమందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాన్ని అనుసరించి కల్యాణోత్సవాన్ని ఆలయం వరకే పరిమితం చేయటమా... లేక యథావిధిగా నిర్వహించటమా అనే అంశంపై స్పష్టత వెలువడుతుందని అన్నారు.

ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తున్న తితిదే ఈవో

ABOUT THE AUTHOR

...view details