ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD: ఆ ఐదు రోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి: తితిదే - తిరుమల

Tirumala Yatra: వరుస సెలవులు తిరుమలపై ప్రభావం చూపుతోంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో అధికసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు.

తితిదే
తితిదే

By

Published : Aug 9, 2022, 10:55 PM IST

TTD On Tirumala Yatra: ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని కోరుతోంది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు.

వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు వరుస సెలవులు ఆగస్టు 19 వరకు ఉన్నాయి. పైగా తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమలకు యాత్రీకుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావాలని తితిదే విజ్ఞప్తి చేసింది. అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాల్లో మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని తెలిపింది. యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో, క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత, ఓపికతో రావాలని తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details