- రఘురామ ఫిర్యాదుపై సీఐడీ స్పందన
ఎంపీ రఘురామ ఫోన్‌ను నిబంధనల ప్రకారమే సీజ్ చేశామని సీఐడీ అధికారులు తెలిపారు. దిల్లీ పోలీసులకు ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి'
కొవిడ్ థర్డ్‌వేవ్ (Covid Third Wave) దృష్ట్యా చిన్నారుల కోసం రాష్ట్రంలో 3 కేర్ సెంటర్లు (care centers) ఏర్పాటు చేయాలని సీఎం జగన్ (cm jagan ) ఆదేశాలు జారీ చేశారు. మూడో వేవ్‌పై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఒక్కో ఆస్పత్రికి రూ.180 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభం
కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం..కరోనాకు పని చేస్తుందని నమ్మేవాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మందు పంపిణీ నెల్లూరు జిల్లా గొలగమూడిలో ప్రారంభమైంది. శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద ఇవాళ లాంఛనంగా పంపిణీ ప్రారంభించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మహిళా లోకం అండగా ఉండాలి: అనిత
విశాఖలో లక్ష్మీఅపర్ణ అనే యువతిపై పోలీసుల తీరును తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. ఈ ఘటనపై హోం మంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అందరికీ ఉచితంగా టీకా'
18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా కేంద్రమే అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించి, జూన్ 21 నుంచి సరికొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'దీపావళి వరకు ఉచిత రేషన్'